ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేవ్ పార్టీ డ్రగ్ కేసులో ఆరుగురు అరెస్టు: డీజీపీ - రేవ్ పార్టీ డ్రగ్ కేసు

విశాఖ రేవ్ పార్టీ డ్రగ్ కేసులో ఇప్పటివరకు ఆరుగురిని అరెస్టు చేశామని... ఐదుగురు డ్రగ్ సప్లయర్స్ ఉన్నట్లు గుర్తించామని డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు.

రేవ్ పార్టీ డ్రగ్ కేసులో ఆరుగురు అరెస్టు: డీజీపీ

By

Published : May 7, 2019, 5:10 PM IST

రేవ్ పార్టీ డ్రగ్ కేసులో ఆరుగురు అరెస్టు: డీజీపీ

విశాఖ రేవ్ పార్టీ డ్రగ్ కేసు విషయంలో ఇప్పటివరకు ఆరుగురిని అరెస్టు చేశామన్న డీజీపీ... ప్రస్తుతానికి ఐదుగురు డ్రగ్ సప్లయర్స్ ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. వందమంది డ్రగ్స్​ వినియోగించినట్లు తమ దర్యాప్తులో తేలిందని వివరించారు. ఈ కేసులో కొంతమంది పెద్దలు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని... వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని డీజీపీ స్పష్టం చేశారు. విశాఖ నగరానికి ఓ ప్రత్యేకత ఉందని... ఆ పేరును పాడు చేయాలని చూస్తే ఉపేక్షించమని హెచ్చరించారు. డ్రగ్స్​కు సంబంధించి ఏ సమాచారమున్నా 75693 09090 అనే నంబర్​కు తెలియజేయాలని కోరారు. విశాఖలో రూ.1.6 కోట్లతో నిర్మించిన ఎంవీపీ మోడల్ పోలీస్​స్టేషన్​ను డీజీపీ ఆర్పీ ఠాకూర్ ప్రారంభించారు. ఇదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా పోలీస్​స్టేషన్లు నిర్మిస్తామని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details