విశాఖ జిల్లా చీడికాడ మండలంలోని అర్జునగిరిలో తాగునీటి సమస్య తలెత్తింది. స్థానిక ముత్యాలమ్మ గుడి సమీపంలో ఉన్న డైరెక్ట్ పంపింగ్ బోరు మోటారు పాడైంది. దీంతో గ్రామంలోని ఆర్అండ్బీ రహదారి ప్రాంతంతో పాటు ఎస్సీ కాలనీకి తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ఆరు రోజులుగా ప్రజలు నీటికి ఇబ్బంది పడుతున్నారు. కరోనా సమయంలో తాగునీటికి ఇతర ప్రాంతాలకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై 'ఈటీవీ భారత్' చీడికాడ ఆర్.డబ్ల్యూ.ఎస్ ఏఈ శ్రీకాంత్ వద్ద ప్రస్తావించగా తక్షణమే మరమ్మతులు చేపట్టనున్నట్లు చెప్పారు.
అర్జునగిరిలో తాగునీటి కష్టాలు
విశాఖ జిల్లా అర్జునగిరిలో ఆరు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇతర ప్రాంతాలకు వెెళ్లి తాగునీటిని మోసుకువస్తున్నట్లు తెలిపారు.
అర్జునగిరిలో ఆరు రోజులగా నిలిచిన తాగునీటి సరఫరా
ఇవీ చదవండి
'క్రేన్ డిజైనింగ్‌లో లోపం వల్లే ప్రమాదం'