ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దివ్య హత్య కేసులో ఆరుగురు నిందితులు అరెస్ట్ - దివ్య హత్య కేసు వార్తలు

విశాఖలో సంచలనం సృష్టించిన దివ్య హత్యకేసులో.... పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. సినిమా తరహాలో నిర్బంధించి... హింసించి..... వేధించి.... దాడి చేసి హతమార్చినట్లు తేల్చారు. దివ్యకు ఆశ్రయం ఎరగా వేసి... ఆసరా ఇస్తామని నమ్మించి... పాశవికంగా హింసించి అంతమొందించినట్లు... నిర్ధారించారు. నిందితుల్లో దివ్య పిన్ని సైతం ఉంది.

six accused arrest in divya murder case
దివ్వ హత్య కేసులో ఆరుగురు అరెస్టు

By

Published : Jun 7, 2020, 7:01 PM IST

Updated : Jun 8, 2020, 2:20 AM IST

దివ్య హత్యకేసు కొలిక్కి వచ్చింది. విశాఖలో అలజడి సృష్టించిన ఈ కిరాతక హత్యకు సంబంధించి పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితురాలు వసంత అలియాస్ జ్యోతి సహా ఆమె సోదరి మంజు, తల్లి ధనలక్ష్మి, స్నేహితుడు సంజయ్, దివ్య పిన్ని కాంతవేణితో పాటు... గీత అనే మరో మహిళ... అరెస్టయిన వారిలో ఉన్నారు. వీరు దివ్యను అనైతిక కార్యకలాపాల్లో దించినట్లు పోలీసుల విచారణలో తేల్చారు. దివ్యను అడ్డుపెట్టుకుని ఆమె పిన్ని కాంతవేణి సైతం లబ్ధి పొందినట్లు కనిపెట్టారు. దివ్యను డబ్బు కోసం గీత అనే మహిళ సహకారంతో వసంత దగ్గరకు చేర్చినట్లు పోలీసులు తేల్చారు. నిందితులపై 302, 201, 343, 324 సెక్షన్లతో పాటు... ఐటీపీ యాక్టు కింద కేసులు నమోదు చేశారు..

ఎదురుతిరగడంతోనే...

దివ్యను అనైతిక వ్యాపారంలోకి దించి డబ్బు సంపాదిస్తున్న వీరికి ఆమె అనుకోకుండా ఎదురుతిరగడంతో... అంతా ఒక్కటయ్యారు. పంపకాల్లో వస్తున్న తేడాలపై ప్రశ్నించడాన్ని సహించలేక తీవ్రంగా కక్ష్య పెంచుకున్నారు. వసంత చెర నుంచి దివ్య బయటపడాలని భావిస్తోందని తెలుసుకుని బలవంతంగా బంధించారు. అత్యంత పాశవికంగా వేధించారు.

అత్యంత కిరాతకంగా వేధించి..

వసంత చెల్లెలు మంజు, స్నేహితుడు సంజయ్ సహకారంతో దివ్యను తీవ్రంగా హింసించినట్లు పోలీసులు తేల్చారు. శరీరంపై చెప్పలేని ప్రదేశాల్లో కాల్చివాతలు పెట్టింది. సినిమా స్టైల్లో... సిగరెట్ నిప్పుతో గాయాలు చేసింది. బలమైన దెబ్బలతో తీవ్రంగా గాయపరిచింది. దివ్యను అంద విహీనంగా మార్చాలనే కసితో ఆమెకు గుండు కొట్టి కనుబొమ్మలు తీసేయించింది. అత్యంత కిరాతకంగా వేధించి చివరకు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైనట్లు తేల్చారు.

చిక్కారు ఇలా..

దివ్య మరణాన్ని వసంత సాధారణ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి భంగపడింది. తల్లి, చెల్లెలు, స్నేహితుడి సహకారంతో...... దివ్య మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాలని ప్రయత్నించి చివరికి పోలీసులకు చిక్కింది. హత్య జరిగిన తీరుపై విచారణ జరిపిన పోలీసులు సైతం నివ్వెరపోయారు. దివ్యపై తీవ్రంగా ద్వేషం పెంచుకుని అత్యంత పాశవికంగా వ్యవహరించారని వెల్లడించారు.

ఈ దారుణ హత్య ఘటనపై వివిధ మార్గాల్లో వచ్చిన సమాచారంతో ఆరుగురిని పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. తప్పించుకునే అవకాశం లేకుండా వారిని అన్ని కోణాల్లోనూ కట్టడి చేశారు. వీరి అరెస్టు అనంతరం మరిన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం విటుల వివరాలను సైతం కూపీ లాగుతున్న పోలీసులు ఒక్కొక్కరిగా వారిని విచారించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: 'దివ్య'మైన జీవితాన్ని.. దారి తప్పించి.. దారుణంగా చంపేశారు!

Last Updated : Jun 8, 2020, 2:20 AM IST

ABOUT THE AUTHOR

...view details