ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నవంబర్​ 1 నుంచి 7 వరకు విశాఖ భూఅక్రమాల ఫిర్యాదు స్వీకరణ - sit commity on vishaka Land encroachments

విశాఖ భూ ఆక్రమణలపై విజయకుమార్ నేతృత్వంలోని సిట్ బృందం కలెక్టరేట్​లో తొలిసారి భేటీ అయ్యింది. నవంబరు 1 నుంచి 7 వరకు ఫిర్యాదులు స్వీకరిస్తామని సిట్ చీఫ్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు.

విశాఖ కలెక్టరేట్లో... భూ అక్రమణలపై సిట్​ బృందం భేటీ

By

Published : Oct 23, 2019, 2:35 PM IST

Updated : Oct 23, 2019, 5:15 PM IST

భూముల కుంభకోణంపై సిట్ తొలి సమావేశమైంది. నవంబరు 1 నుంచి 7 వరకు ఫిర్యాదులు స్వీకరిస్తామని సిట్ చీఫ్‌ విజయ్‌కుమార్‌ అన్నారు. ఫిర్యాదుల స్వీకరణకు వీఎంఆర్‌డీఏ ఆడిటోరియంలో ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 13 మండలాల్లో జరిగిన భూఅక్రమాలపై ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. ఆన్‌లైన్‌లోనూ సమాచారం ఇవ్వొచ్చని సిట్ చీఫ్‌ వెల్లడించారు. నేరుగా ఫిర్యాదు చేసేందుకు ఇష్టపడని వారి కోసం ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సిట్ రూపొందించిన ఫార్మాట్‌లోనే ఫిర్యాదులు స్వీకరిస్తామని విజయ్‌కుమార్‌ అన్నారు. ఫిర్యాదుల స్వీకరణ, పరిశీలన కోసం 13 బృందాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గత సిట్ నివేదిక రెండు రోజుల క్రితం అందిందని... దాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు. అభియోగాలు ఎదుర్కొంటున్న అధికారులనూ విచారణకు పిలుస్తామన్నారు.

విశాఖ భూ ఆక్రమణలపై సిట్​ బృందం కసరత్తు
Last Updated : Oct 23, 2019, 5:15 PM IST

ABOUT THE AUTHOR

...view details