సింహాచలంలో అప్పన్న గిరిప్రదక్షిణ ఘనంగా ప్రారంభమైంది. తొలి పావంచా వద్ద ప్రత్యేక పూజలు చేసిన వేద పండితులు ప్రదక్షిణను ప్రారంభించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి పూజలో పాల్గొన్నారు. సింహాచలం కొండల చుట్టూ 32 కి.మీ. మేర ఈ ప్రదక్షిణ జరుగనుంది. సుమారు 10 లక్షలమంది భక్తులు పాల్గొంటారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల కోసం పలుచోట్ల వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. తాగునీరు ప్రసాద వితరణకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేడుక ముగిసేంతవరకు విశాఖ నగరంలో ట్రాఫిక్ పోలీసులు భారీ వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. ప్రదక్షిణ జరిగే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు.
భక్తి శ్రద్ధలతో సింహాద్రి అప్పన్న గిరిప్రదక్షిణలు - simhachalam
సింహాచలంలో వెలసిన వరాహ లక్ష్మీనరసింహా స్వామి గిరిప్రదక్షిణలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సింహాచలం కొంటల చుట్టూ 32 కి.మీ మేర ఈ ప్రదక్షిణ జరగనుంది.
సింహాద్రి అప్పన్న గిరిప్రదక్షిణలు