ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏకాంతంగా సింహాద్రి అప్పన్నస్వామి వారి చందనోత్సవం - simhadri appannaswamy chandanotsavam

విశాఖ సింహాద్రి అప్పన్నస్వామి వారి చందనోత్సవాన్ని ఏకాంతంగా నిర్వహించాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావలనుకునే వారు 13వ తేదీలోగా విరాళాలను దేవస్థానం అకౌంట్​కు పంపగలరని స్పష్టం చేశారు.

simhachalam
సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి

By

Published : May 4, 2021, 12:21 PM IST

విశాఖ జిల్లా సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి వారి చందనోత్సవం ఏకాంతంగా నిర్వహించాలని దేవస్థానం నిర్ణయించింది. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సంప్రదాయం ప్రకారం 14వ తేదీన నాలుగు విడతలుగా స్వామివారికి చందన సమర్పణ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిన దాతలు విరాళాలను దేవస్థానం అకౌంట్ UPI ID:9491000635@SBI కు గానీ ఆన్ లైన్లో SBI అకౌంట్ నంబర్ 11257208642, IFSC:SBIN0002795 కు పంపచవచ్చని స్పష్టం చేశారు.

అర కేజీ చందనం సమర్పణ కోసం రూ. 10,116 , కేజీ చందన సమర్పణకోసం రూ. 20,116 భక్తులు పై అకౌంట్​కు పంపించాలని స్పష్టం చేశారు. విరాళాలు పంపాక దాని స్క్రీన్ షాట్ తీసి మీ చిరునామాను , గోత్రనామాలను 6303800736 నంబర్​కు వాట్సప్, మెసేజ్ చేయాలని తెలిపారు. విరాళాలను 13వ తేదీలోగా పంపించాలన్నారు. చందనోత్సవ కార్యక్రమాన్ని లైవ్ ద్వారా వీక్షించొచ్చని తెలిపారు. ఏమైనా సలహాలు, సందేహాలుంటే 6303800736కు ఫోన్ చేయవచ్చని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details