విశాఖపట్నంలోని సింహాద్రి అప్పన్న దేవాలయంలో ఆఖరి విడత చందనం అరగదీత కార్యక్రమం ప్రారంభమైంది. మూడు రోజులపాటు స్వామి వారి సన్నిధిలో 125కేజీల మణుగుల చందనాన్ని అరగదీసి... ఈ నెల 16న ఆషాడ పౌర్ణమి సందర్భంగా అప్పన్నకు సమర్పించనున్నారు. దీంతో సింహాద్రి అప్పన్న భక్తులకు సంపూర్ణ చందన స్వామిగా దర్శనమివ్వనున్నారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారని...వారి కోసం ఏ లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని దేవాదాయశాఖ అధికారులు తెలిపారు.
సంపూర్ణ చందన స్వామిగా దర్శనమివ్వనున్న సింహాద్రి అప్పన్న !! - సింహాచలం
సింహాచలంలోని అప్పన్న సన్నిధిలో చందనం అరగదీత కార్యక్రమం ప్రారంభమైంది. దీంతో అప్పన్న సంపూర్ణ చందన స్వామిగా దర్శనమివ్వనున్నారు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు దేవాదాయశాఖ అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది.
సింహాచలంలోని అప్పన్న సన్నిధిలో చందనం అరగదీత కార్యక్రమం