శుక్రవారం నుంచి సింహాద్రి అప్పన్న దర్శన సమయాన్ని మరో రెండు గంటలు పెంచుతున్నట్లు ఆలయ ఈవో సూర్యకళ ప్రకటించారు. ఉదయం 6.30 నుంచి 1.30 నిమిషాల వరకు భక్తులు శ్రీ వరాహలక్ష్మీనారసింహస్వామి వారిని దర్శించుకోవచ్చని తెలిపారు. కర్ఫ్యూ నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ నియమం 20వ తేదీ వరకు అమల్లో ఉంటుందన్నారు.
సింహాద్రి అప్పన్న దర్శన సమయం మరో రెండు గంటలు పెంపు.. - Simhadri appanna darshanalu were extended
శుక్రవారం నుంచి విశాఖ సింహాద్రి అప్పన్న దర్శన సమయాన్ని మరో రెండు గంటలు పెంచుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం 20వ తేదీ వరకు అమల్లో ఉంటుందన్నారు. కర్ఫ్యూ నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
సింహాద్రి అప్పన్న
సుప్రభాతం నుంచి పవళింపు వరకు ... స్వామివారికి జరగాల్సిన సేవలన్నీ సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయని సూర్యకళ తెలిపారు. భక్తులు కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి నిత్యన్నదాన పథకానికి బి. మహాలక్ష్మి అనే భక్తురాలు రూ.లక్ష సమర్పించారని తెలిపారు.
ఇదీ చదవండి:ఈ నెల 11న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ