విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో నేటి నుంచి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతిస్తున్నారు. భక్తులు ప్రత్యక్షంగా పాల్గొనే విధంగా దేవస్థానం అధికారులు నూతన విధానాన్ని ప్రవేశపెట్టారు. స్వామివారికి జరిగే నిత్య కళ్యాణం, స్వాతి నక్షత్ర హోమం, లక్ష్మీనారాయణ కళ్యాణంలో.. ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకున్న భక్తులు పాల్గొనవచ్చు. నేటి నుంచి ఈ పద్ధతిని అమలు చేస్తున్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా భౌతిక దూరం పాటిస్తూ ఈ పూజలను అర్చకులు ఆలయంలో నిర్వహిస్తారు.
ఇకనుంచి సింహాద్రి అప్పన్న ఆర్జిత సేవలలో భక్తులకు అనుమతి - సింహాద్రి అప్పన్న దేవాలయం వార్తలు
సింహాద్రి అప్పన్న సన్నిధిలో నేటి నుంచి ఆర్జిత సేవలలో భక్తులు ప్రత్యక్షంగా పాల్గొనే సదుపాయం ఏర్పాటు చేశారు. ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారు ఆలయంలో స్వామివారి సేవలో పాల్గొనవచ్చు.
సింహాద్రి అప్పన్న దేవాలయం