ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Morphing videos: 'ఇద్దరిపై చర్యలకు.. దేవాదాయశాఖ కమిషనర్​కు సిఫారసు' - విశాఖపట్నం తాజా వార్తలు

సింహాద్రి అప్పన్న దేవస్థానంలో మార్ఫింగ్ వీడియోల వివాదంపై ఈవో సూర్యకళ సమావేశం నిర్వహించారు. ఇటీవలే వచ్చిన రెండు మార్ఫింగ్ వీడియోలపై అంతర్గత విచారణ జరిపామని తెలిపారు. ఇద్దరిని బాధ్యులుగా గుర్తించి దేవాదాయశాఖ కమిషనర్​కు లేఖ రాశామన్నారు.

మాట్లాడుతున్న ఈవో సూర్యకళ
మాట్లాడుతున్న ఈవో సూర్యకళ

By

Published : Jul 4, 2021, 8:22 PM IST

సింహాద్రి అప్పన్న దేవస్థానంలో మార్ఫింగ్ వీడియోల వివాదంపై ఈవో సూర్యకళ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇటీవలే వచ్చిన రెండు మార్ఫింగ్ వీడియోలపై అంతర్గత విచారణ జరిపామని తెలిపారు. ఇద్దరిని బాధ్యులుగా గుర్తించి దేవాదాయశాఖ కమిషనర్​కు లేఖ రాసినట్టు చెప్పారు. మార్ఫింగ్ చేసిన వైదికుడు.. తన తప్పును అంగీకరించాడని... ఎలాంటి దురుద్దేశం లేదని.. తెలియకే తప్పు చేసినట్టుగా అతను వివరణ ఇచ్చారని ఈవో వెల్లడించారు.

వైదికుడు తప్పును అంగీకరించాడు గనుక పెద్ద ఎంక్వైరీ, సైబర్ క్రైం వరకు వెళ్లాల్సిన అవసరం రాలేదన్నారు. వీడియో మార్ఫింగ్ చేసిన వేదపండితులు 10 ఏళ్లుగా దేవాలయంలో ఉద్యోగం చేస్తున్నట్లు ఈవో చెప్పారు. మొత్తంగా.. ఇద్దరిపై చర్యలకు దేవదాయ శాఖ కమిషనర్​కు సిఫారసు చేశామని పేర్కొన్నారు. వాట్సప్ గ్రూపుల్లో మార్ఫింగ్ వీడియోలు షేర్ చేసిన తొమ్మిది మందికి నోటీసులిచ్చామని.. అందరూ వివరణ ఇచ్చినట్లు స్పష్టం చేశారు. దేవస్థానం ప్రతిష్ఠకు భంగం వాటిల్లితే ఎవరినీ ఉపేక్షించమని ఈవో తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details