ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సింహాద్రి అప్పన్నకు సంబరంగా పెళ్లి చూపులు - vishaka

విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్నకు వైభవంగా పెళ్లిచూపుల మహోత్సవం జరిగింది. అనంతరం డోలోత్సవమూ  ఘనంగా నిర్వహించారు. ప్రతియేటా స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవంలో భాగంగా ముందుగా స్వామివారికి పెళ్లిచూపుల నిర్వహించడం ఆనవాయితీ.

ఆలయ ప్రధాన అర్చకులు గోపాలక్రిష్ణమాచార్యులు

By

Published : Mar 21, 2019, 6:50 PM IST

ఆలయ ప్రధాన అర్చకులు గోపాలక్రిష్ణమాచార్యులు
విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్నకు వైభవంగా పెళ్లిచూపుల మహోత్సవం జరిగింది. అనంతరం డోలోత్సవమూ ఘనంగా నిర్వహించారు. ప్రతియేటా స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవంలో భాగంగా ముందుగా స్వామివారికి పెళ్లిచూపుల నిర్వహించడం ఆనవాయితీ. స్వామివారిని సుప్రభాతసేవతో మేల్కొలిపి విశేష పూజలు నిర్వహించిన అనంతరం మెట్ల మార్గం ద్వారా పుష్కరిణిలో ఈ ఉత్సవం చేశారు.

స్వామివారికి బుగ్గన చుక్క పెట్టి పెళ్లి కొడుకుగా సుందరంగా తయారు చేశారు. ఈ పౌర్ణమిని బొట్టు అడిగే పౌర్ణమిగా గ్రామస్తులు అభివర్ణిస్తారు. పెళ్లిలో భాగంగా స్వామివారు.. తన సోదరి పైడితల్లమ్మను ఆమె కుమార్తెను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాలని వేడుకుంటారు. ఈ సన్నివేశాన్ని అర్చకులు సంప్రదాయబద్దంగా నిర్వహించారు. స్వామి వారి పెళ్లి కుదరడంతో అర్చకులు రంగులు చల్లుకొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఏప్రిల్ 16న స్వామివారి కళ్యాణం జరగనుందని అర్చకులు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details