సింహాద్రి అప్పన్న హుండీ ఆదాయాన్ని ఆలయాధికారులు లెక్కించారు. మొత్తం కోటి 67 లక్షల 8వేల 154 రూపాయలు సమకూరినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ఆదాయం మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 31 రోజుల ఆదాయం లెక్కించినట్లు పేర్కొన్నారు. భక్తులు కానుకల రూపంలో సమర్పించిన వాటిలో 124 గ్రాముల బంగారం, 11 కేజీల 320 గ్రాములు వెండి ఉన్నట్లు తెలిపారు.
కోటి రూపాయలు దాటిన సింహాద్రి అప్పన్న హుండీ ఆదాయం - appanna temple latest news
విశాఖ జిల్లాలోని సింహాద్రి అప్పన్న హుండీ ఆదాయం కోటి రూపాయలు దాటిందని ఆలయాధికారులు తెలిపారు. దీంతోపాటు 124 గ్రాముల బంగారం, 11 కేజీల 320 గ్రాములు వెండి వచ్చినట్లు పేర్కొన్నారు.
సింహాద్రి అప్పన్న ఆలయం