విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న ఆలయ అధికారులు స్వామివారి హుండీ ఆదాయాన్ని లెక్కించారు. 30 రోజులకు గాను రూ. 77,34,750 నగదు, 55గ్రాముల బంగారం, 7కిలోల 750 గ్రాముల వెండి కానుకల రూపంలో సమకూరింది. వివాహాలు, శుభకార్యాలకు వసతి అద్దెకు ఇవ్వడంతో స్వామి వారి హుండీ ఆదాయం గణనీయంగా పెరిగింది. రానున్న రోజుల్లో ఆలయానికి మరింత ఆదాయం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా కొందరికి మాత్రమే ప్రత్యక్ష పూజలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.
సింహాద్రి అప్పన్న హుండీ ఆదాయం లెక్కింపు - విశాఖ జిల్లా తాజా వార్తలు
సింహాద్రి అప్పన్న ఆదాయం గణనీయంగా పెరిగింది. కేవలం 30 రోజుల్లోనే రూ. 77,34,750 నగదు, 55గ్రాముల బంగారం, 7కిలోల 750 గ్రాముల వెండి కానుకల రూపంలో చేకూరాయి. రానున్న రోజుల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంచానా వేస్తున్నారు.
సింహాద్రి అప్పన్న హుండీ ఆదాయం లెక్కింపు