కరోనా వ్యాప్తి నేపథ్యంలో 15 మంది అర్చకులతో చందనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సింహాద్రి అప్పన్నస్వామి ఆలయ ఈవో వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ నెల 28 నుంచి ఆన్లైన్ పూజలు నిర్వహిస్తామని వెల్లడించారు. చందనోత్సవంలో స్వామి వారు నిజరూపంలో దర్శనమిస్తారని... అయితే ఈసారి దేవస్థానానికి సంబంధించిన యూట్యూబ్ ఛానెల్లో చూడాలని కోరారు. ఉత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తామని ఈవో అన్నారు.
సింహాద్రి అప్పన్న సన్నిధిలో రేపు చందనోత్సవం - రేపు సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవం వార్తలు
సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో రేపు జరిగే చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో భక్తులను స్వామి దర్శనానికి అనుమతించడం లేదు.
simhadri appanna chandanostavam