విశాఖ జిల్లా సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పాలకమండలి సమావేశం అయ్యింది. అడవివరం గోశాలలోని సమావేశ మందిరంలో ఈవో, పాలక మండలి సభ్యులు సమావేశమయ్యారు. ఛైర్ పర్సన్ సంచయిత గజపతి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. కరోనా కారణంగా ఆలయ ఆదాయం తగ్గటంతో.. ఆదాయ మార్గాలను సమకూర్చుకునే అంశాలపై చర్చలు జరిగాయి. ప్రధాన ప్రతిపాదనలు, ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు. ఎంపిక చేసిన దేవస్థాన భూములు లీజుకు ఇచ్చే అంశంపైనా చర్చించారు.
సింహాచల దేవస్థాన పాలక మండలి సమావేశం - సింహాచల దేవస్థాన పాలక మండలి సమావేశం వార్తలు
విశాఖ జిల్లా సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పాలకమండలి సమావేశం అయ్యింది. ఛైర్ పర్సన్ సంచయిత గజపతి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఆలయ ఆదాయ మార్గాలు పెంచుకునే అంశం, భూములు లీజుకిచ్చే అంశంపై చర్చలు జరిపారు.
సింహాచల దేవస్థాన పాలక మండలి సమావేశం