సింహాచలం ఆలయ ప్రధాన అర్చకుడు గోపాలకృష్ణామాచార్యులను ఈవో ఎం.వెంకటేశ్వరరావు సస్పెండ్ చేశారు. అప్పన్న సన్నిధిలో చందనోత్సవం రోజున అనుమతి లేకుండా అంతరాలయంలోకి ఒక భక్తుడిని తీసుకెళ్లారనే ఆరోపణతో ఆయనపై చర్యలు తీసుకున్నారు. లాక్డౌన్లో భాగంగా ఆలయంలోకి ఎవరినీ అనుమతించలేదు. ఆలయంలోకి వెళ్లిన భక్తునిపై క్రిమినల్ కేసు పెడతామని ఈవో తెలిపారు.
సింహాచలం ఆలయ ప్రధాన అర్చకుడి సస్పెండ్ - lock down violations in simhachalam temple
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు సింహాచలం ఆలయ ప్రధాన అర్చకుడిపై సస్పెన్షన్ వేటు పడింది. అప్పన్న చందనోత్సవం రోజున అనుమతి లేకుండా అంతరాలయంలోకి ఓ భక్తున్ని తీసుకెళ్లారనే ఆరోపణలతో ఆయనపై ఆలయ ఈవో చర్యలు తీసుకున్నారు.
సింహాచల ఆలయ ప్రధాన అర్చకుడి సస్పెండ్