విశాఖ సింహాచలం దేవస్థానం పూర్వపు ఈఈ మల్లేశ్వరరావు సస్పెండ్ చేస్తూ.. ఆలయ ఈవో భ్రమరాంబ ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం ఆయన కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవస్థానంలో పనిచేస్తున్నారు.
ఆయన సస్పెన్షన్కు గల కారణాలను ఈవో వివరించారు. భైరవవాక సమీపంలోని సింహాచల ఆలయ భూములను అంతర్జాతీయ పాఠశాల నిర్మాణానికి ఓ సంస్థకు లీజుకు ఇచ్చారు. దాని ద్వారా వచ్చే ఆదాయంలో కొంత ఆలయానికి చేరేలా ఒప్పందం ఉంది. పాఠశాల నిర్మాణ పురోగతికి సంబంధించి దేవస్థానం ఛైర్పర్సన్ సంచయిత గజపతి ఇటీవల నివేదిక కోరారు. అయితే పనులు పూర్తికాకుండానే పూర్తయినట్లు ఈఈగా ఉన్న మల్లేశ్వరరావు తప్పుడు నివేదిక ఇచ్చారు. ఈ విషయం గుర్తించి ఆయనను సస్పెండ్ చేశారు.