విశాఖలో సింహాచలం దేవస్థానానికి చెందిన పంచ గ్రామాల భూ సమస్య పరిష్కారానికి నియమించిన కమిటీ.. నేడు అమరావతిలో సమావేశమైంది. గత నెలలో సలహా కమిటీలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, దేవదాయశాఖ ప్రత్యేక కమిషనర్లకు చోటు కల్పిస్తూ జీవో విడుదలయ్యింది. వీరితోపాటు కమిటీ సభ్యులు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, సీఎం ప్రధాన సలహాదారు, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
సమస్య ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై తిరుపతి ప్రత్యేక ఉప కలెక్టర్ సురేంద్ర విచారణ నివేదికలో పేర్కొన్న సూచనలను పరిగణనలోకి తీసుకుని.. సమస్య త్వరగా పరిష్కారం అయ్యే విధంగా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.