ఘనంగా సింహద్రి అప్పన్న సోదరి పైడితల్లి ఉత్సవాలు - సింహద్రి అప్పన్న
విశాఖ సింహాచలం అప్పన్న సోదరి పైడితల్లమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజలు చేశారు.
విశాఖ జిల్లా అప్పన్నసోదరి పైడితల్లి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివస్తున్నారు. దేవాదాయ శాఖ అధికారులు క్యూలైన్లలో భక్తులకు మజ్జిగ, మంచినీరు అందించారు. సింహాద్రి అప్పన్న ఆలయంలో సాయంత్రం 6 గంటల నుంచి దర్శనాలు నిలిపివేయనున్నారు. ఈ ఉత్సవం సందర్భంగా సింహగిరి అంతటా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తులకు దేవాదాయ శాఖ అధికారులు ఉచిత అన్నదాన సదుపాయం కల్పించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. గోపాలపట్నం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.