అటు ఆధ్యాత్మికంగా, ఇటు పర్యటకంగా ప్రసిద్ధి చెందిన సింహాచల వరాహ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం రూపు మారుతుందా.. అంటే అవుననే అంటున్నారు స్థానికులు. కొండ సమీపంలో చేప్పట్టిన ఏపీ ట్రాన్స్ కో ట్రాన్స్ మిషన్ నిర్మాణం భక్తుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. స్వామి తొలిమెట్టు మార్గం మీద నుంచి ఈ మహా విద్యుత ప్రవాహ గమనం ఉండే విధంగా టవర్ నిర్మాణం చేయడం భక్తులకు ఇబ్బంది కరంగా మారింది. ఎపీ ట్రాన్స్ కో... అప్ గ్రేడ్లో భాగంగా 120 కిలోవాట్ నుంచి 220 కిలోవాట్ సామర్ధ్యం పెంచే విద్యుత్ లైన్ పనులు ప్రారంభించారు.
పదిహేడు కోట్ల ఖర్చుతో సింహాచల కొండ భాగంలో ఇరువై హై పవర్ ట్రాన్స్ మిషన్ టవర్ నిర్మాణం చేపట్టారు. వీటిలో ప్రధానంగా తొలిమెట్టు నుంచి చూస్తే స్వామి ఆలయ ఆకృతులు దర్శనమిస్తాయి. అలాంటి ఆకృతులు కనిపించకుండా ఈ టవర్ అడ్డుగా కనిపిస్తోందని స్థానికులు భావిస్తున్నారు. విద్యుత్ లైన్ నిర్మాణం వల్ల సింహాచల కొండల అందానికి, ప్రకృతి సమతుల్యత విఘాతం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.