విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న సన్నిధిలో ఈనెల 26వ తేదీన జరిగే చందనోత్సవాన్ని కరోనా వైరస్ నేపథ్యంలో... ఏకాంతంగా నిర్వహిస్తామని ఆలయ ఈవో ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. స్వామికి జరిగే ఉత్సవాల్లో అత్యంత ప్రధానమైనది ఈ చందన యాత్ర అని తెలిపారు. స్వామివారు 364 రోజులు నిత్య రూపంలో దర్శనమిస్తారు. సంవత్సరంలో ఒక్క చందనోత్సవం నాడే స్వామి వారి నిజరూప భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఉత్సవానికి రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శించుకునేందుకు వస్తుంటారు.
కరోనా ఎఫెక్ట్: సింహాద్రి అప్పన్నకు ఏకాంతంగా చందనోత్సవం - vishaka district
విశాఖ జిల్లా సింహాచలం అప్పన్న స్వామి దేవాలయంలో చందనోత్సవాన్ని స్వామివారికి ఏకాంతంగా నిర్వహిస్తామని ఆలయ ఈవో ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఇలా చేస్తున్నట్లు వివరణ ఇచ్చారు.
సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవం ఏకాంతంగా..