ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో సంతకాల సేకరణ.. ఎందుకంటే..? - signs collecting in vizag

విశాఖలో రాజధాని ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ నిర్ణయంపై ఉత్తరాంధ్ర చైతన్య వేదిక సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము సమర్థిస్తున్నట్లు వెల్లడించారు.

signs collecting in vizag
విశాఖలో సంతకాల సేకరణ

By

Published : Jan 10, 2020, 9:10 PM IST

విశాఖలో సంతకాల సేకరణ
విశాఖలో కార్యనిర్వహక రాజధాని పెట్టాలనే ప్రభుత్వ నిర్ణయంపై ఉత్తరాంధ్ర చైతన్య వేదిక సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టింది. నగరంలోని జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన సంతకాల సేకరణ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని రాజధాని ఏర్పాటుకు అనుకూలంగా సంతకాలు చేశారు. అన్ని వసతులు ఉన్న విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావడం వల్ల రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని నగరవాసులు అభిప్రాయపడ్డారు. తమ ఆకాంక్షను సంతకాల ద్వారా ప్రతిబింబించారు. విశాఖలో రాజధాని వస్తే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలు అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము సమర్థిస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details