విశాఖలో అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ సంతకాల సేకరణ నిర్వహించింది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. నగరవాసులు, కార్మికులు, ఉద్యోగులు సంతకాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తే పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తారని...భవిష్యత్తులో ఉద్యోగుల పిల్లలకు ఉపాధి అవకాశాలు ఉండవని సీఐటీయూ నగర అధ్యక్షుడు ఆర్.ఎస్.కె.వి కుమార్ తెలిపారు. రానున్న కాలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వికలాంగులకు రిజర్వేషన్లు ప్రైవేట్ రంగాల్లో ఉండవని.. కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖలో అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కమిటీ సంతకాల సేకరణ నిర్వహించింది. ప్రజల సంపద అయినట్టువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కార్పొరేటర్లకు కట్టబెట్టే కేంద్ర ప్రభుత్వ యోచనను ప్రజలు తిప్పికొట్టాలని వారు కోరారు.
సంతకాలు చేస్తున్న నగర వాసులు