ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తా: సిదిరి అప్పలరాజు - sidiri appalraju taja news

అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా వెళ్తున్న మంత్రి సిదిరి అప్పలరాజును విశాఖ జిల్లా పాయకరావుపేటలో వైకాపా కార్యకర్తలు కలిశారు. మత్స్యకార సంఘం నాయకులతో మంత్రి సిదిరి అప్పలరాజు మాట్లాడారు. మైనార్టీ, ఎస్సీ వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.

SIDIRI APPALRAJU CONDUCT MEETING WITH  YCP LEADERS IN VISKAHA DST
SIDIRI APPALRAJU CONDUCT MEETING WITH YCP LEADERS IN VISKAHA DST

By

Published : Jul 31, 2020, 12:38 PM IST

రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి బీసీ, మైనార్టీ, ఎస్సీ వర్గాలకు పెద్ద పీఠ వేస్తూ సామాజిక న్యాయం పాటిస్తూ పాలన సాగిస్తున్నారని మత్స్య శాఖ మంత్రి సిదిరి అప్పల రాజు తెలిపారు. అమరావతి నుంచి శ్రీకాకుళం వెళ్తున్న మంత్రికి పాయకరావుపేటలో వైకాపా మత్స్యకార సంఘం నాయకులు చోడిపల్లి శ్రీను ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అన్ని వర్గాల వారికి సమన్యాయం చేస్తూ ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని మంత్రి వివరించారు. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఆయన కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మత్స్యకారుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మంత్రి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details