విశాఖ జిల్లా మునగపాకలో సాంబమూర్తి దేవుని శూలాల మహోత్సవం సోమవారం వైభవంగా ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది తరలివచ్చారు. గ్రామం అంతా భారీ ఎత్తున విద్యుత్తు అలంకరణ చేశారు. ఉత్సవ ఊరేగింపు ఆలయం నుంచి ప్రారంభమై సంతబయలు, మధ్యవీధి, పంచాయతీ వీధి, మందబయల, పల్లపువీధిమీదుగా సాగింది. రెండంతస్తుల గుమ్మటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఊరేగింపులో పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.
శైవ భక్తుడు మావూరి రాజు 101 శూలాలు ధరించారు. మరికొంతమంది భక్తులు నాలుక, బుగ్గలు, నుదుటన ఇనుప చువ్వలు గుచ్చుకొని రక్తతర్పణం చేసి శూలాలతో నృత్య ప్రదర్శనలు చేశారు.