విశాఖ జిల్లా పరవాడ మండలం దాలాయిపాలెంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూముల్లో ఏర్పాటు చేసిన రొయ్యల చెరువులను అధికారులు తొలగించారు. పరవాడ మండలం చీపురుపల్లి పడమరలో నిబంధనలకు విరుద్ధంగా మత్స్య శాఖ అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమిలో యథేచ్ఛగా రొయ్యల పెంపకాన్ని సాగిస్తున్నారు. రొయ్యల చెరువు పేరుతో మూడు వందల యాభై ఎకరాలల్లో ఏర్పాటు చేసిన చేపలు, రొయ్యల చెరువులను జేసీబీలతో అధికారులు తొలగించారు.
ప్రభుత్వ భూముల్లో రొయ్యల చెరువులు..తొలగించిన అధికారులు
విశాఖ జిల్లా పరవాడ మండలం దాలాయిపాలెం లో నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూముల్లో ఏర్పాటు చేసిన రొయ్యల చెరువులను అధికారులు తొలగించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు రెవిన్యూ అధికారులు తెలిపారు.
ప్రభుత్వ భూమిలో రొయ్యల చెరువులు..తొలగించిన అధికారులు
సుప్రీంకోర్టు ఆదేశానుసారం ప్రభుత్వ భూమిలో రొయ్యల చెరువులను రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం, మత్స్య శాఖ అధికారులు తొలగించారు. సర్వే నంబర్లు 461, 462, 491లలో సుమారు 350 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నించినట్లు గుర్తించారు. కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: పరిశ్రమలో కార్మికుడు మృతి.. కుటుంబ సభ్యుల ఆందోళన..