ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ కేజీహెచ్​లో సిబ్బంది కొరత.. రోగుల అవస్థలు - విశాఖపట్నంలో కింగ్ జార్జీ ఆస్పత్రి నేటి వార్తలు

విశాఖపట్నంలోని కింగ్​జార్జి ఆస్పత్రిలో సిబ్బంది కొరత తప్పడం లేదు. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న కారణంగా ముగ్గురు వైద్య సిబ్బందికి వైరస్ సోకింది. ఫలితంగా దాదాపు 300 మంది వైద్య సిబ్బంది.. క్వారంటైన్​కు వెళ్లారు. కేవలం కొవిడ్ రోగులకే చికిత్స అందిస్తున్నందున సాధారణ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Shortage of staff in Vishakha KGH with patients face Health problems
విశాఖ కేజీహెచ్​లో సిబ్బంది కొరత.. చికిత్స అందక రోగుల అవస్థలు
author img

By

Published : Jun 17, 2020, 7:45 PM IST

ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా ఒడిశా, ఛత్తీస్​గఢ్ రాష్ట్రాల నుంచి చికిత్స కోసం విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రికి రోగులు వస్తారు. ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో పనిచేసే సిబ్బంది హాజరు శాతం తక్కువగా ఉండటం వల్ల సాధారణ రోగాలకు అందించే చికిత్సను కుదించారు. ఇక్కడ పనిచేస్తున్న వైద్యుల్లో కొందరిని కొవిడ్ ఆసుపత్రులకు డిప్యూటేషన్​పై పంపడం, రొటేషన్ విధానంలో వారు క్వారంటైన్​లో ఉండాల్సి రావడం వల్ల కేవలం 40 మంది కంటే తక్కువ సిబ్బంది మాత్రమే అందుబాటులో ఉంటున్నారు.

ఆస్పత్రిలో వివిధ విభాగాల్లో 1500 పడకలు ఉన్నాయి. ఆంధ్ర వైద్య కళాశాల.. ఈ అసుపత్రికి అనుబంధంగా ఉంది. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి చికిత్స అందించిన.. వైద్య నిపుణులు, వైద్య పీజీలు, నర్సింగ్ సిబ్బంది, పారిశుద్య్ద సిబ్బంది అందరూ క్వారంటైన్​కు వెళ్లారు. తాజాగా రెండు రోజుల వ్యవధిలోనే మూడు కేసులు నమోదు కావడం ఈసమస్యకు కారణంగా తెలుస్తోంది.

మూడు విడతల్లో క్వారంటైన్​కు..

మూడు విడతల్లో ఆసుపత్రికి చెందిన వైద్య సిబ్బంది క్వారంటైన్​కు వెళ్లారు. మొదటి విడతగా గత నెలలో క్వారంటైన్​కు వెళ్లిన 56 మంది వారి క్వారంటైన్ ముగించుకుని విధుల్లో చేరారు. రెండో విడతలో వెళ్లిన సీనియర్, జూనియర్ వైద్యులు, నర్సులు ఇతర సిబ్బందితో కలిపి క్వారంటైన్ పూర్తి చేసుకున్న 110 మంది విధుల్లోకి చేరాల్సి ఉంది. రెండు రోజులు క్రితమే మూడో విడతలో 121 మంది క్వారంటైన్​కు వెళ్లడంతో వైద్య సేవలకు ఆటంకం కలుగుతోంది. కొవిడ్ పాజిటివ్ నిర్థరణ అయిన వార్డులో చికిత్స పొందుతున్న 30 మందినీ క్వారంటైన్​కు తరలించారు.

ప్రస్తుతం ప్రమాదాలు, ఇతర సమస్యల తీవ్రత ఎక్కువగా లేకపోయినా.. మున్ముందు రోగుల సంఖ్య పెరిగితే వారికి సేవలు అందించడం కష్టమేనని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున అన్నారు.

ఇదీచదవండి. కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...12 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details