విశాఖ జిల్లా నర్సీపట్నంలో రేపటి నుంచి వ్యాపార సంస్థలన్నీ ఎప్పటి మాదిరిగానే పనిచేస్తాయని వర్తక సంఘం వెల్లడించింది. రాత్రి 9 గంటల వరకు వాణిజ్య సంస్థలు తెరిచి ఉంటాయని ఆ సంఘం పేర్కొంది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది జూలై నుంచి పాక్షిక లాక్ డౌన్ కొనసాగింది. ఆ గడువు ఆగస్టు నెలతో ముగియడంతో నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. విశాఖ మన్యం ముఖద్వారమైన నర్సీపట్నం పై పరిసర ప్రాంతాలైన సుమారు ఏడెనిమిది మండలాలకు చెందిన గ్రామాలు నిత్యం వ్యాపార వాణిజ్యాలు కొనసాగిస్తూ ఉంటాయి.
రేపటి నుంచి నర్సీపట్నంలో యధావిధిగా దుకాణాలు - నర్సీపట్నంలో లాక్ డౌన్
విశాఖ జిల్లా నర్సీపట్నంలో లాక్ డౌన్ ఆంక్షలు సడలించారు. రేపటి నుంచి వ్యాపార సంస్థలన్నీ ఉదయం 9గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరుచుకోనున్నాయి.

రేపటి నుంచి నర్సీపట్నంలో యదావిధిగా దుకాణాలు