ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శివరాత్రి జాతర.. పోతురాజు బాబు ఆలయానికి పోటెత్తిన భక్తులు - విశాఖలో మహాశివరాత్రి వేడకలు 2021

మహాశివరాత్రి జాతర సందర్భంగా విశాఖ జిల్లా రావికమతం మండలం పోతురాజు బాబు ఆలయానికి 2వ రోజు భక్తులు పోటెత్తారు. దర్శనానికి ముందు కళ్యాణలోవ జలాశయంలో పుణ్యస్నానాలు ఆచరించి.. పోతురాజు బాబు, పెద్దింటమ్మ ఆలయాన్ని భక్తులు దర్శించుకుంటారు.

Shivratri Jatara .. Devotees flocking to Pothuraju Babu Temple
శివరాత్రి జాతర.. పోతురాజు బాబు ఆలయానికి పోటెత్తిన భక్తులు

By

Published : Mar 12, 2021, 12:57 PM IST

మహాశివరాత్రి జాతర సందర్భంగా విశాఖ జిల్లా రావికమతం మండలం పోతురాజు బాబు ఆలయానికి భక్తులు 2వ రోజు పోటెత్తారు. ఈ ఉత్సవాలు రేపటి వరకు కొనసాగుతాయి. ఇక్కడ ఆలయం దర్శనానికి ముందు కళ్యాణలోవ జలాశయంలో పుణ్యస్నానాలు ఆచరించి.. పోతురాజు బాబు, పెద్దింటమ్మ ఆలయాన్ని భక్తులు దర్శించుకుంటారు.

ఈ నెల 10వ తేదీ నుంచి విశాఖపట్నం, అనకాపల్లి, నర్సీపట్నం ఆర్టీసీ డిపోల నుంచి సుమారు 80 ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేశారు. లక్షలాది మంది భక్తులు ఇక్కడకు చేరుకుని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. కొత్తపేట సర్కిన్ ఇన్​స్పెక్టర్ లక్ష్మణమూర్తి సారథ్యంలో సుమారు 300 మంది పోలీసులను భధ్రత ఏర్పాట్ల నిమిత్తం అందుబాటులో ఉంచారు.



ఇదీ చూడండి:అబ్బో.. ఈ కంద ఎంత పెద్దదో

ABOUT THE AUTHOR

...view details