ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మెప్మా' కేంద్రంలో మతిస్థిమితం లేని వ్యక్తికి ఆశ్రయం - shelter for an insane person news

మధ్యప్రదేశ్ కు చెందిన మతిస్థిమితం సరిగా లేని ఓ వ్యక్తి.. ఏడాది కాలంగా విశాఖ జిల్లా నర్సీపట్నంలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో ఆశ్రయం పొందుతున్నాడు. తన వాళ్ల రాక కోసం ఎదురూచూస్తున్నా.. కనీసం సరిగ్గా వివరాలను చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాడు.

shelter for an insane person inMEPMA CNTER, Narsipatnam

By

Published : Oct 13, 2019, 1:21 PM IST

'మెప్మా' కేంద్రంలో మతిస్థిమితం లేని వ్యక్తి ఆశ్రయం

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలోని పట్టణ నిర్మూలన పేదరిక సంస్థలో మతిస్థిమితం లేని ఓ వ్యక్తి... ఏడాది కాలంగా ఆశ్రయం పొందుతున్నాడు. అతడు అయోమయంగా చెబుతున్న వివరాల ప్రకారం... మధ్యప్రదేశ్​ వాసి అని, అతని తల్లిదండ్రులు టీ కొట్టు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. సదరు వ్యక్తికి సంబంధించిన అంశం స్థానిక ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్ దృష్టికి వెళ్లింది. మతిస్థిమితం లేక ఆశ్రయం పొందుతున్న వ్యక్తిని తల్లిదండ్రులకు అప్పగించే ప్రయత్నం చేయాలని అధికారులకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details