ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పరిహారం చెల్లించాలని గొర్రెల పెంపకందారుల ఆందోళన - విశాఖ జిల్లా తాజా వార్తలు

చనిపోయిన గొర్రెలు, మేకలకు పరిహారం అందించాలని కొరుతూ విశాఖ జిల్లా దేవరాపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెంపకందారులు ఆందోళన చేపట్టారు. వైద్య సేవలు అందించని పశువైద్యాధికారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు తహసీల్దార్ రమేశ్ బాబుకు వినతిపత్రం అందజేశారు.

Breaking News

By

Published : Nov 30, 2020, 6:24 PM IST

ఆందోళన చేస్తున్న గొర్రెల పెంపకం దారులు

విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం వెంకటరాజపురంలో 15 రోజులుగా వింత వ్యాధితో 68 గొర్రెలు, మేకలు మృతి చెందాయి. పశు వైద్యులు కనీసం స్పందించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా సోమవారం మరో ఐదు గొర్రెలు మృత్యువాత పడ్డాయి. దీంతో ఆందోళన చెందిన పెంపకం దారులు చనిపోయిన గొర్రెలతో పాటు వింత వ్యాధితో బాధపడుతున్న మరికొన్నింటిని తీసుకుని దేవరాపల్లి ప్రభుత్వ పశువుల ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ వైద్యాధికారి లేకపోవటం చూసిన వారంతా తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు.

చనిపోయిన గొర్రెలకు పరిహారం అందించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పశువైద్యాధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ రమేశ్ బాబుకు వినతి పత్రం అందజేశారు. బాధితులకు సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకన్న మద్దతు తెలిపారు. 73 గొర్రెలు, మేకలు చనిపోయినా పశు వైద్యులు కనీసం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత జేడీకి ఫిర్యాదు చేసినా.. పరిస్థితిలో మార్పు లేదని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details