విశాఖ జిల్లా వెంకన్నపాలెం మసీదులో నిర్మించిన షాదీఖానా భవనాన్ని అనకాపల్లి ఎంపీ డా. సత్యవతి, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రారంభించారు. ముస్లింలకు ఎల్లప్పుడూ తమ ప్రభుత్వం అండగా ఉంటుందని కరణం ధర్మశ్రీ తెలిపారు. 20 మంది ముస్లింలకు ఇళ్లు ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. గోవాడ, అంబేరుపురంలో అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఎంపీ సత్యవతి హామీ ఇచ్చారు.
వెంకన్నపాలెం మసీదులో షాదీఖానా భవనం ప్రారంభం
వెంకన్నపాలెం ముసీదులోని షాదీఖానా భవనాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అనకాపల్లి ఎంపీ, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ హాజరయ్యారు.
కార్యక్రమంలో పాల్గొన్న అనకాపల్లి ఎంపీ, చోడవరం ఎమ్మెల్యేలు