ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై 'నిర్భయ' కేసు - అయ్యన్నపాత్రుడిపై లైంగిక వేధింపుల కేసు నమోదు వార్తలు

తెదేపా సీనియర్​ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు నమోదైంది. తనను దూషించారన్న నర్సీపట్నం మున్సిపల్​ కమిషనర్​ ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై లైంగిక వేధింపుల కేసు
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై లైంగిక వేధింపుల కేసు

By

Published : Jun 16, 2020, 11:56 PM IST

Updated : Jun 17, 2020, 9:37 AM IST

తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై విశాఖ జిల్లా నర్సీపట్నం పోలీస్ స్టేషన్‌లో నిర్భయ కేసు నమోదైంది. మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి ఫిర్యాదు మేరకు... 354a (iv), 500, 504, 505( 1) b, 505 (2), 506, 509 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
మున్సిపల్ కార్యాలయంలో రుత్తల లత్స పాత్రుడు చిత్రపటం తొలగింపుపై బెదిరింపు ధోరణిలో మాట్లాడరని కమిషనర్​ పేర్కొన్నారు. సమావేశ మందిరం నవీకరణ తర్వాత ఫొటో పెడతామన్న మాట నిలబెట్టుకోకపోతే బట్టలూడదీసి అంటూ వ్యాఖ్యలు చేసినట్లు... సామాజిక మాధ్యమాల్లో చూశానని కృష్ణవేణి నివేదించారు. ఈ మాటలు తీవ్ర ఆవేదన కలిగించాయని... స్వేచ్ఛగా విధి నిర్వహణ చేసే పరిస్థితి లేదని అన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా అయ్యన్నపాత్రుడిపై నర్సీపట్నం పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు.

Last Updated : Jun 17, 2020, 9:37 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details