gavarapeta villegers :విశాఖ జిల్లా కశింకోట పరిధిలో.. గవరపేట నుంచి శారదానది అవతలి ఒడ్డుకు నిత్యం 200 మంది రాకపోకలు సాగిస్తుంటారు. సుమారు.. 12 వందల ఎకరాల పంట భూములు, పశువుల కళ్లాలు.. నదికి అవతలే ఉన్నాయి. అయితే.. ఈ ప్రవాహం దాటేందుకు తాటిచెట్లతో చేసిన దోనెలనే ఉపయోగిస్తున్నారు. రైతులంతా కలిసి ఈ తాటి దోనె నడిపేందుకు ఓ కుటుంబ౦తో ఒప్పందం చేసుకుని.. ఏటా డబ్బు చెల్లిస్తుండడం గమనార్హం.
రైతులతో పాటు పశువులనూ.. ఈ దోనె సాయంతోనే శారదానది దాటిస్తుంటారు. కాగా.. రైతుల అవస్థలు తొలగించేందుకు ఎట్టకేలకు వంతెన మంజూరైంది. దాని నిర్మాణానికి నదిలో కొన్ని పిల్లర్లు కూడా వేశారు. దీంతో.. ఇక కష్టాలు తొలిగినట్టేనని స్థానికులు ఆనందించారు.