ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాటుసారా తరలిస్తున్న ఏడుగురు అరెస్ట్.. నాలుగు వాహనాలు సీజ్ - ఆంధ్ర ప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం

విశాఖ జిల్లాలో నాటు సారా విచ్చలవిడిగా దొరుకుతోంది. దీనిపై పోలీసులు ప్రత్యేక నిఘా వేసి ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో పడవల ద్వారా అక్రమ రవాణా చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది.

vishaka district
నాటుసారా తరలిస్తున్న ఏడుగురు అరెస్ట్.. నాలుగు వాహనాలు సీజ్

By

Published : Apr 25, 2020, 8:58 PM IST

రాష్ట్రంలో నాటుసారా విచ్చలవిడిగా దొరుకుతుంది.. ఎక్సైజ్ శాఖ ఏమి చేస్తుందని స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించిన నేపథ్యంలో ఆబ్కారీ శాఖ నాటుసారాపై కదం తొక్కింది. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు మంగబంద వద్ద ఎక్సైజ్ సీఐ అనిల్ కుమార్ బృందం రాత్రివేళల్లో కాపు కాశారు. పడవలపై ఒడిశా నుంచి ఆంధ్రాకు తరలించి ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో తరలిస్తుండగా పట్టుకున్నారు. 460 లీటర్ల నాటుసారాతో పాటు రెండు ఆటోలు, రెండు మోటార్ సైకిళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. అక్రమ నాటు సారా తయారీ కానీ రవాణా గాని చేస్తే కఠినమైన శిక్షలు తప్పవని సీఐ అనిల్ కుమార్ హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details