ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉపాధ్యాయ బదీలీల ప్రక్రియకు.. సర్వర్​ సమస్యలు - ఉపాధ్యాయుల బదీలీ వార్తలు విశాఖ

రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ప్రహసనంగా మారింది. బదిలీలకు సంబంధించి కచ్చితమైన విధాన రూపకల్పనలో ప్రభుత్వం విఫలమైందని ఉపాధ్యాయులు పెదవి విరుస్తున్నారు. తాజాగా.. తీసుకున్న షెడ్యూల్ మేరకు పరిశీలిస్తే ఈ నెలాఖరు వరకు ప్రక్రియ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా... వచ్చే ఏడాదిలోనే బదిలీలు జరుగుతాయని స్పష్టమవుతోంది.

teachers
ఉపాధ్యాయ బదీలీల ప్రక్రియకు సర్వర్​ సమస్యలు
author img

By

Published : Dec 22, 2020, 1:20 PM IST

ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన ప్రక్రియ వెబ్ ఆప్షన్ల ద్వారానే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 13 జిల్లాల నుంచి వేల మంది టీచర్లు బదిలీలకు దరఖాస్తు చేయడంతో వారంతా ఆప్షన్ల కోసం ఆన్లైన్లో లాగిన్ కావాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ సర్వర్​ను సిద్ధం చేయలేదని ఉపాధ్యాయులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. సర్వర్​లో వచ్చే సమస్యలు పరిష్కరించాలని పదేపదే కోరినప్పటికీ పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. 2015 లో వెబ్ ఆప్షన్ల ద్వారా బదిలీలు చేసినప్పుడు ఎటువంటి సమస్యలు రాలేదని ఇప్పుడు ఎందుకు వచ్చిందో చెప్పాలని నిలదీస్తున్నారు.

విశాఖ జిల్లాకు సంబంధించి 3263 ఖాళీలకు 5000 మందికి పైగా టీచర్లు దరఖాస్తులు చేశారు. వీరిలో 98 శాతం వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేశారు. మిగిలిన వారికి మరో అవకాశం ఇచ్చారు. ఇటువంటి వారు ఈ నెల 21, 22 తేదీలలో సంబంధిత మండల విద్యాశాఖ అధికారులు కార్యాలయాలకు వెళ్లి ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే ఈ నెల 23 నుంచి 31వ తేదీ వరకు సంబంధిత మండల విద్యాశాఖ అధికారి కార్యాలయానికి వెళ్లి మార్పులు, చేర్పులు చేసుకోవచ్చని విద్యాశాఖ చెబుతోంది. రోజుకి పది మంది టీచర్లకు మాత్రమే మార్పులు, చేర్పులకు అవకాశముండగా... ఎంఈవో కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటుకు విద్యాశాఖ ఆదేశించింది. డీటీపీ ఆపరేటర్లు, ఎంఐఎస్ కోఆర్డినేటర్​లు మాత్రమే ఈ ప్రక్రియ చేపట్టాలని విద్యాశాఖ స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details