ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పదిహేను రోజుల వ్యవధిలో కరోనాతో అన్నాతమ్ముడు మృతి! - anakapalli latest news

విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న వ్యక్తి మృతి చెందాడు. అతని మరణం పట్ల ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులు, సిబ్బంది సంతాపం తెలిపారు. 15 రోజుల క్రితమే అతని సోదరుడు సైతం కన్నుమూయగా.. ఆ ఇంట్లో విషాదం నెలకొంది.

died person
మరణించిన వ్యక్తి

By

Published : May 9, 2021, 10:57 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో సీనియర్ అసిస్టెంట్​గా పనిచేస్తున్న గుడివాడ హరికృష్ణ (36) కరోనాతో మృతి చెందారు. పదిహేను రోజుల క్రితమే మృతుని అన్నయ్య రాజేశ్​ కొవిడ్​ బారిన పడి మరణించాడు.

ఈ విషాదం నుంచి తేరుకోకముందే హరికృష్ణ కన్నుమూయటంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. హరికృష్ణ మృతి పట్ల ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్ కుమార్, వైద్యులు, సిబ్బంది సంతాపం తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details