ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Sendoff to president: విశాఖలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన.. వీడ్కోలు పలికిన గవర్నర్ - ap latest news

Sendoff to president: విశాఖలో రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ పర్యటన నేటితో ముగిసింది. ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలో భాగంగా.. విచ్చేసిన ఆయన మూడు రోజుల పాటు విశాఖలో బస చేశారు. ఇవాళ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సహా స్పీకర్ తమ్మినేని సీతారం, మంత్రి అవంతి.. ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి వీడ్కోలు పలికారు.

sendoff to president ramnath kovind after vishakapatnam tour
విశాఖలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన

By

Published : Feb 22, 2022, 4:55 PM IST

Sendoff to president: విశాఖలో రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ పర్యటన నేటితో ముగిసింది. ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలో భాగంగా.. విచ్చేసిన ఆయన మూడు రోజుల పాటు విశాఖలో బస చేశారు. ఇవాళ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నావల్ ఎయిర్ బేస్ ఐఎన్​ఎస్ డేగలో ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి వీడ్కోలు పలికారు. అనంతరం రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ దంపతులు దిల్లీకి బయలుదేరి వేళ్లారు.

రాష్ట్రపతికి వీడ్కోలు సమయంలో.. గవర్నర్ సహా శాసనసభాపతి తమ్మినేని సీతారాం, మంత్రి అవంతి శ్రీనివాస్, విశాఖ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:YS Viveka Murder Case: వివేకా హత్య కేసు విచారణ కడప జిల్లా కోర్టుకు బదిలీ

ABOUT THE AUTHOR

...view details