ప్రస్తుత సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులను ఎదుర్కొనేందుకు ఆత్మరక్షణ కోర్సులు నేర్చుకోవాలని విశాఖ దిశ పోలీస్ స్టేషన్ మహిళా ఎస్సైలు అన్నారు. యాక్సిస్ బ్యాంక్, దిశ పోలీస్ స్టేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థినులకు ఆత్మరక్షణపై అవగాహన కల్పించారు. హైదరాబాద్కు చెందిన 'రాణి రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ' సహకారంతో వారికి మెళకువలు నేర్పించారు. ఆగంతుకులు దాడి చేసినప్పుడు వారిని ఎలా ఎదుర్కోవాలి..? ఆపద సమయాల్లో దిశ పోలీస్ స్టేషన్లను ఎలా సంప్రదించాలి..? అనే అంశాలపై అవగాహన కల్పించారు. దిశ యాప్ను అందరూ వినియోగించుకోవాలని సూచించారు.
ఆత్మరక్షణపై విశాఖలో విద్యార్థినులకు అవగాహన - self difence training
మహిళలపై జరుగుతున్న దాడులను ఎదుర్కోవడానికి ఆత్మరక్షణ కోర్సులు నేర్చుకోవాలని విశాఖ దిశ పోలీస్స్టేషన్ మహిళా ఎస్సైలు అన్నారు. అనుకోనిది జరిగితే మహిళలు దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.
![ఆత్మరక్షణపై విశాఖలో విద్యార్థినులకు అవగాహన SELF DIFFENCE COURCES FOR WOMAN IN VIZAG](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6237500-590-6237500-1582895503996.jpg)
ఆత్మరక్షణ కోర్సులపై మహిళలకు అవగాహన