విశాఖపట్నం జిల్లాలో పాలీసెట్ ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విద్యా శాఖ అధికారి రాజానా భాస్కర్ రావు తెలిపారు. ఆదివారం జరగనున్న పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 56 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 15,755 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు.
ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్..
హాల్ టిక్కెట్లను ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని భాస్కర్ రావు సూచించారు. వీటితో పాటు.. తమకు కోవిడ్ లేదన్న సెల్ఫ్ డిక్లరేషన్ను అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేశారు. విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రానికి ముందుగానే చేరుకోవాలన్నారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్ ధరించి నిబంధనలు పాటించాలని కోరారు.
ఇవీ చూడండి:
రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షాలు: ఐఎండీ