అనకాపల్లి జాతీయ రహదారి వద్ద 270 కిలోల గంజాయి స్వాధీనం - seizure of cannabis at anakapalli news
విశాఖ జిల్లా అనకాపల్లి జాతీయ రహదారి వద్ద కారులో తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ. పదిహేను లక్షలు ఉంటుందని తెలిపారు.
కారులో తరలిస్తున్న గంజాయి
విశాఖ జిల్లా అనకాపల్లి జాతీయ రహదారి వద్ద నానో కారులో తరలిస్తున్న గంజాయిని పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆగి ఉన్న కారును గమనించిన ట్రాఫిక్ పోలీసులు అనకాపల్లి పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. వాహనాన్ని తనిఖీ చేయగా.. అందులో 270 కిలోల గంజాయిని గుర్తించారు. దాని విలువ సుమారు రూ.15 లక్షలు ఉంటుందని ఎస్సై తెలిపారు. నిందితులు ఇద్దరు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:విశాఖలో 12 కిలోల గంజాయి పట్టివేత