విశాఖ నుంచి పొరుగు రాష్ట్రాలకు గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని ఎస్ఐ రంజిత్ అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా పాతులగూడ గ్రామానికి చెందిన కుంచెల శ్రీను.. దారకొండలో 16 కేజీల గంజాయిని కొనుగొలు చేశాడు. కారులో తెలంగాణ రాష్ట్రానికి గంజాయిని తరలిస్తుండగా.. సీలేరు జెన్కో కేంద్రం వద్ద డీ 42 బెటాలియన్ సీఆర్ఫీఎఫ్ సిబ్బంది, పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమలో సరుకు పట్టుబడిందని ఎస్ఐ చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసి కారు, గంజాయిని సీజ్ చేసి.. కోర్టుకు తరలించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
16 కిలోల గంజాయి పట్టివేత... వ్యక్తి అరెస్ట్ - visakhapatnam district newsupdates
విశాఖ నుంచి తెలంగాణ రాష్ట్రానికి గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని సీలేరు జెన్కో కేంద్ర వద్ద ఎస్ఐ రంజిత్ ఆదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి కారు, గంజాయిని సీజ్ చేసి.. కోర్టుకు తరలించినట్లు తెలిపారు.
![16 కిలోల గంజాయి పట్టివేత... వ్యక్తి అరెస్ట్ Seizure of cannabis in sealer Man arrested at visakhapatnam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10056119-474-10056119-1609314144194.jpg)
సీలేరులో గంజాయి పట్టివేత... వ్యక్తి అరెస్ట్