విశాఖ మన్యం నుంచి ముంబయికి తరలిస్తున్న రూ. 44 లక్షలు విలువ చేసే ఎండు గంజాయిని తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా హాద్నూర్ పోలీసులు పట్టుకున్నారు. నాల్కల్ మండలం శంషెల్లాపూర్ శివారు జహీరాబాద్-బీదర్ మార్గంలో దీన్ని స్వాధీనం చేసుకున్నారు.
విశాఖ జిల్లా నర్సీపట్నం ఏజెన్సీ ప్రాంతాల నుంచి మహారాష్ట్రలోని ముంబయికి పొక్లెయిన్ తరలించే ట్రాలీ లారీ అడుగుభాగంలో ప్రత్యేక పెట్టెలు అమర్చి.. 106 ప్యాకెట్లలో తరలిస్తున్న 436 కేజీల రెండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన లారీ సహా గంజాయి ప్యాకెట్లను జహీరాబాద్ డీఎస్పీ కార్యాలయానికి తరలించారు.