విశాఖ మన్యం నుంచి వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న 100 కిలోల గంజాయిని నర్సీపట్నం రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం అందుకున్న నర్సీపట్నం పోలీసులు గబ్బడా వంతెన వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. అనుమానిత వాహనం అక్కడకి రాగానే ఆపి తనిఖీ చేశారు. రెండు బస్తాలతో 100 కిలోల గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల్లో గెత్తంపేట గ్రామానికి చెందిన తుపాకుల రమేష్, బుచ్చింపేట గ్రామానికి చెందిన రమణలను అరెస్టు చేసి,కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 10 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గంజాయి రవాణా పూర్తిస్థాయిలో అరికట్టేందుకు ఉన్నతాధికారులతో కలిసి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మని నర్సీపట్నం రూరల్ ఎస్ఐ రవి కుమార్ తెలిపారు.
మన్యంలో 100కిలోల గంజాయి పట్టివేత - మన్యం మీదుగా తరలిస్తున్న 100కిలోల గంజాయి పట్టివేత
విశాఖ మన్యం నుంచి వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న 100 కిలోల గంజాయిని నర్సీపట్నం రూరల్ పోలీసులు పట్టుకున్నారు.

మన్యం మీదుగా తరలిస్తున్న 100కిలోల గంజాయి పట్టివేత