విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్ డివిజన్లో ఇటీవల కాలంలో పట్టుబడిన గంజాయిని నేడు అధికారులు తగులబెట్టేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుమారు 82 వేల ఐదు వందల కిలోల గంజాయిని దహనం చేసేందుకు పోలీస్, ఎక్సైజ్ అధికారులు సన్నాహాలు చేశారు. నర్సీపట్నానికి సమీపంలోని ఉత్తర వాహిని డంపింగ్ యార్డ్‌కు దాడుల్లో పట్టుబడిన గంజాయిని తరలించి.. అక్కడ కాల్చివేసేందుకు చేసిన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ డీఐజీ, విశాఖ జిల్లా రూరల్ ఎస్పీ కృష్ణారావు. జిల్లా ఎక్సైజ్ అధికారులు పాల్గొననున్నారు. దీంతో కొద్దిరోజులుగా స్టేషన్లలో నిల్వ ఉన్న గంజాయికి నేటితో మోక్షం కలగనుంది.
దాడుల్లో పట్టుబడిన గంజాయికి మోక్షం.. డంపింగ్ యార్డ్‌లో..? - దాడుల్లో పట్టుబడిన గంజాని తగులబెట్టనున్న అధికారులు తాజా వార్తలుట
విశాఖలో కొద్ది రోజులుగా జరిపిన దాడుల్లో పట్టుబడిన గంజాయికి నేటితో మోక్షం లభించనుంది. దాదాపు 82 వేల, 500 కిలోల గంజాయిని తగలబెట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
దాడుల్లో పట్టుబడిన గంజాయి