ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీలేరు జలాశయాలకు జలకళ - సీలేరు

కొన్ని రోజులుగా వరుణుడు చూపిస్తున్న ప్రతాపానికి సీలేరు కాంప్లెక్స్ జలాశయాల్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇన్ ఫ్లో ఎక్కువగా ఉన్న కారణంగా దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.

సిలేరు కాంప్లెక్స్ జలాశయాలకు జలకళ

By

Published : Aug 11, 2019, 6:57 AM IST


సీలేరు నది పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సీలేరు కాంప్లెక్స్‌లోని జలాశయాల్లో నీటి మట్టాలు గణనీయంగా పెరిగాయి. గత పదిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఏపీ వాటా నీరు 40 టీఎంసీలకు పెరిగింది. గత నెల 25 నాటికి బలిమెల జలాశయంలో ఏపీ వాటా 1.25 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం25.7 టీఎంసీలకు చేరింది. జోలాపుట్‌కు ఆరు టీఎంసీలు, బలిమెలకు 13 టీఎంసీలు వరద నీరు చేరినట్లు అధికారులు తేల్చారు. జోలాపుట్‌ జలాశయానికి 29 వేల క్యూసెక్కులు, బలిమెలకు 70 వేలు, డొంకరాయికు 20 వేలు, సీలేరు జలాశయానికి తొమ్మిదివేలు క్యూసెక్కులు ఇన్‌ఫ్లోగా ఉంది. ఆరు టీఎంసీలు నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేసినట్లు జెన్‌కో అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details