ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతు భరోసా కేంద్రంలో విత్తనాల పంపిణీ ప్రారంభం - seeds distribution news in namavaram

విశాఖ జిల్లా నామవరంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రంలో విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గొల్ల బాబురావు ప్రారంభించారు. అనంతరం రాయితీపై విత్తనాలను రైతులకు అందజేశారు.

రాయితీ విత్తనాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే బాబురావు
రాయితీ విత్తనాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే బాబురావు

By

Published : Jun 5, 2020, 1:15 PM IST

విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం నామవరం రైతు భరోసా కేంద్రంలో విత్తనాల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ప్రారంభించి... రాయితీపై విత్తనాలను రైతులకు సరఫరా చేశారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన రైతు భరోసా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

పాయకరావుపేట డివిజన్ పరిధిలో విత్తనాల పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. సుమారు 20 వేల మంది రైతులకు 3,520 క్వింటాల విత్తనాలను అందించేందుకు సిద్ధంగా ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి:ఈ వ్యాయామ చిట్కాలతో బద్దకానికి చెక్​!

ABOUT THE AUTHOR

...view details