విశాఖ రైల్వేస్టేషన్ నుంచి రైళ్లను నడపడానికి అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. రైళ్ల రాకపోకలకు కేంద్రం అనుమతివ్వడంతో... కరోనా వ్యాప్తి నివారణ చర్యలతో అధికారులు సిద్ధమయ్యారు. అధునాతన సాంకేతిక పరికరాలు వినియోగిస్తూ... ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు రసాయనాలతో పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నారు. ప్రతీ ప్రయాణికుణ్ని 90 నిమిషాల ముందే స్టేషన్‌కు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
విశాఖ రైల్వేస్టేషన్‌ను విమానాశ్రయం తరహాలో మార్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. వచ్చే వారు, వెళ్లే వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాం. కీలకమైన థర్మల్ వీడియో స్కానింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాం. దాని ద్వారా ప్రతి ఒక్కరినీ స్కానింగ్ చేసే అవకాశముంది. సిబ్బందితో పరీక్ష చేయటం వల్ల ఎక్కువ సమయం పడుతున్న కారణంగా ఈ విధానం తీసుకొచ్చాం.