ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో అక్రమంగా నగదు తరలిస్తోన్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ జిల్లా లమతపుట్టు వద్ద సరిహద్దులోని భద్రతా బలగాలు తనిఖీ చేస్తుండగా జయపురం నుంచి ముంచంగిపుట్టు మండలం గతురుముండ వైపు వెళ్తున్న స్కార్పియో వాహనంలో... సుమారు 52 లక్షలు రూపాయలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నగదు గంజాయి క్రయ విక్రయాలకు సంబంధించినదిగా పోలీసులు అనుమానిస్తున్నారు. నగదును లమతపుట్టు పోలీస్ అవుట్‌పోష్టుకు అందజేశారు.
ఆంధ్రా ఒడిశా సరిహద్దులో భారీగా నగదు పట్టివేత - Security forces on the border of Andhra Pradesh arrested two persons
ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో పోలీసులు భారీగా నగదు పట్టుకున్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా స్కార్పియో వాహనంలో నగదు తరలిస్తోన్న ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ సొమ్ము గంజాయి క్రయ విక్రయాలకు సంబంధించిందిగా పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆంధ్రా ఒడిశా సరిహద్దులో భారీగా నగదు పట్టివేత
TAGGED:
aob latest news