ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాక్సింగ్‌ క్రీడాకారుల గుర్తింపు కమిటీలో రైల్వే క్రీడా సంఘం ప్రధాన కార్యదర్శి - ఖేలో ఇండియా క్రీడల తాజావార్తలు

ఖేలో ఇండియా బాక్సింగ్‌ క్రీడాకారుల గుర్తింపు కమిటీలో సభ్యునిగా తూర్పు కోస్తా రైల్వే క్రీడా సంఘం ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు విశాఖలో ఆయనకు నియమాక పత్రాన్ని అందించారు.

Secretary of Railway Sports Association
బాక్సింగ్‌ క్రీడాకారుల గుర్తింపు కమిటీలో రైల్వే క్రీడా సంఘం ప్రధాన కార్యదర్శి

By

Published : Jan 14, 2021, 11:36 AM IST

ఖేలో ఇండియా బాక్సింగ్‌లో పాల్గొనే క్రీడాకారుల గుర్తింపు కమిటీలో సభ్యునిగా తూర్పు కోస్తా రైల్వే క్రీడా సంఘం ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీనివాసరావును నియమించారు. ఈ మేరకు వాల్తేర్ డీఆర్‌ఎం చేతన్‌కుమార్‌ శ్రీవాత్సవ్‌, రైల్వే క్రీడాధికారి ప్రదీప్‌ యాదవ్‌ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. భారతీయ రైల్వేలో తూర్పు, దక్షిణ జోన్ల పరిధిలోని ప్రతిభావంతులైన బాక్సర్లను ఈ కమిటీ గుర్తిస్తుంది. అనంతరం శిక్షణ శిబిరాలు నిర్వహించి.. ఖేలో ఇండియా క్రీడలకు పంపుతుంది. శ్రీనివాసరావు ప్రస్తుతం రైల్వే మహిళల సీనియర్‌ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details